17 July, 2026 | 2:33 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

రుణమాఫీతో 7.74 లక్షల మందికి లబ్ధి

22-06-2024 01:16 AM

మంత్రి తుమ్మలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే, టెస్కాబ్ అధ్యక్షుడు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 7,74,833 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని టెస్కాబ్ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్‌సీఏబీ) అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. టెస్కాబ్ ఉపాధ్యక్షుడు కొత్తకుర్మ సత్తయ్య, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ డీసీసీబీ చైర్మన్లు చిట్టి దేవేందర్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, కొరమోని వెంకటయ్య, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.