calender_icon.png 29 January, 2026 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థాయిలాండ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన రైతుకు ఘన సన్మానం

29-01-2026 12:00:00 AM

తంగళ్ళపల్లి, జనవరి 28(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ థాయిలాండ్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో గోల్ మెడల్ సాధించిన చిన్నలింగపూర్ గ్రామానికి చెందిన రైతు కోడిముంజ ప్రవీణ్ను గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మల్బరి షూట్ హార్వెస్టర్ను రూపొందించిన ప్రవీణ్, ఈ మిషన్ ద్వారా మల్బరి కొమ్మలను కత్తిరించడంతో పాటు ఒకేసారి కట్టలుగా కట్టే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ వినూత్న ఆవిష్కరణకు గాను సర్పంచ్ శ్యాగ విజయ్ దేవేందర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జక్కుల రవి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని ప్రవీణ్కు అభినందనలు తెలిపారు.