calender_icon.png 29 January, 2026 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజన న్యాయవాదులతోనే న్యాయం

29-01-2026 12:00:00 AM

జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య

ముషీరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): బహుజన వర్గాల నుంచి వచ్చిన న్యాయవాదులు పెరిగితేనే బహుజనులకు న్యాయం జరుగుతుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ వి. ఈశ్వరయ్య అన్నారు. దేశ జనాభాలో 87 శాతం ఉన్న బహుజన వర్గాలకు సంబంధించిన కేసులపై తీర్పులు చెప్పే న్యాయవ్యవస్థలో మాత్రం అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతోందన్నారు.

ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ కు బహు జనుడే చైర్మన్ కావాలని మీడియా సమావేశం అసోసియేషన్ అధ్యక్షుడు తలకొక్కుల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా న్యాయవాదులచే బహుజనులకే బార్ కౌన్సి ల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పొన్నం దేవరాజ్ గౌడ్, నాయకులు జంగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.