11 April, 2026 | 3:09 PM

మార్స్‌పై మహా సముద్రం

16-08-2024 01:10 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 15: విశ్వంలో మానవ ఆవాసానికి అనువైన మరో గ్రహం ఏదైనా కనిపిస్తుందేమోనని అనేక దేశాల ఖగోళ శాస్త్రవేత్తలు వెదుకుతూనే ఉన్నారు. అయితే, మ పక్కనే భూమికి కవల గ్రహమైన అంగాకుడిపైనే భారీ సముద్రం ఉన్నదని తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. మనకు కనిపిస్తున్న దుమ్ము ధూళి, ఎడారిలాంటి అంగారక ఉపరితలం కింద భారీ మంచు సముద్రాలు ఉన్నాయని తెలిపింది. అది కూడా ఉపరితలానికి 1.5 నుంచి 2.7 మీటర్ల లోతులోనే ఉన్నట్టు వెల్లడించింది. ఈ మంచు అంగారక గ్రహం మొత్తం విస్తరించిన ఉన్నదని తెలిపింది. అయితే, ఈ మంచు ఒకవేళ బయటకు వస్తే మరుక్షణంలో అంగారకుడి వాతావరణంలో కలిసి ఆవిరై పోతుందని తెలిపింది.