11 April, 2026 | 1:15 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

బంగ్లాదేశ్‌కు ఐరాస బృందం

16-08-2024 01:09 AM

ఐరాస, ఆగస్టు 15: ప్రజా తిరుగుబాటుతో అల్లకల్లోలంగా మారిన బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళన సందర్భంగా నిరసనకారుల హత్యలపై వాస్తవాలు తెలుసుకొనేందుకు నిజనిర్ధారణ కమిటీని పంపనున్నది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ గురువారం ఎక్స్‌లో ఈ మేరకు సందేశం పోస్ట్ చేశారు. ‘జూలై, ఆగస్టులో విద్యార్థుల విప్లవం సందర్భం గా జరిగిన నేరాలను విచారించేందుకు వచ్చేవారం ఐరాస ఒక నిజని ర్ధారణ కమిటీని బంగ్లాదేశ్‌కు పంపనున్నది. బుధవారం ఈ విషయాన్ని ఐరాస మానవహక్కుల సంఘం డైరెక్టర్ ఓల్కర్ టర్క్ మహ్మద్ యూనస్ కు తెలియజేశారు’ అని ఆ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. 1971లో బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐరాస నిజనిర్ధారణ బృందాన్ని పంపటం ఇదే మొదటిసారి.