వెయ్యి కోట్లతో ‘గ్రీన్‌ఫీల్డ్’ ప్లాంట్
02-12-2024 02:06 AM
నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): కోకా కోలా, థమ్స్‌అప్ వంటి శీతల పానియాలను ఉత్పత్తి చేసే హిం దుస్థాన్ బేవరేజెస్ సంస్థ తమ ప్లాంట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది. బండ తిమ్మాపూర్ ఫుడ్‌పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్‌ను సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన ఈ గ్రీన్‌ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణం ఇటీవలే పూర్తికాగా.. ఇది పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి.




