calender_icon.png 19 December, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటల వల్ల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు

19-12-2025 05:49:39 PM

సదాశివపేట (విజయక్రాంతి): శుక్రవారం రోజున సదాశివపేట మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల ముభారక్ పూర్(ఏ), ప్రాథమిక పాఠశాల మార్కండేయ నగర్ ను సందర్శించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు. ముభారక్ పూర్ (ఏ) పాఠశాలలో తరగతి వారిగా గణితం, ఇంగ్లీష్, తెలుగు విషయాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఊగే ఉయ్యాల మరియు జారుడు బండను ప్రారంభించడం జరిగిందని, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతోపాటు, ఆటలు ముఖ్యం, ఎందుకంటే విద్యార్థులకు ఆటలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని,

ఆరోగ్యం మెరుగుపడుతుందని,జట్టు ఆటల వల్ల సహకారం, నాయకత్వ లక్షణాలు పెరుగుతయని మరియు క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు.పాఠశాల ఆవరణలో ఊగే ఉయ్యాల మరియు జారుడు బండను ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ప్రతిరోజు సమయసారణి అనుసరించి విద్యార్థులకు కొంత సమయాన్ని ఆటలకు  కేటాయించాలని తెలిపారు. మార్కండేయ నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతి గదిలో విద్యార్థులను విషయాలవారీగా పరిశీలించడం జరిగిందని, విద్యార్థులు ఎక్కువ మంది పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని హెచ్.ఎం కు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాలల హెచ్.ఎంలు దయానంద్, పుష్పలత, ఉపాధ్యాయులు కిష్టయ్య, మల్లికార్జున్,బ్రహ్మంచారి, సిఆర్పి రాజేశ్వర్, అంగన్వాడి టీచర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.