11న ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో సెలవు
మేడ్చల్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్ ల సాధారణ ఎన్నికలలో భాగంగా 11న పోలీంగ్ ఉన్నందున ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ మను చౌదరి సెలవుదినంగా ప్రకటించారు. మూడు చింతలపల్లి, ఆలియాబాదు, ఎల్లంపేట్ మున్సిపాలిటీ లలో మున్సిపల్ ఎలక్షన్ ల సందర్భంగా ప్రభుత్వ,
ప్రభుత్వేతర సంస్థలు, దుకాణాలు, కర్మాగారాల పనిచేసే సిబ్బందికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1988, ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1974 ప్రకారం ఈ నెల 11న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు కలెక్టర్ సూచించారు.
మద్యం, కల్లు దుకాణాలు బంద్
ఈనెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ ఉన్నందున మద్యం, కల్లు దుకాణాలు బందు చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరిగే ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు మద్యం, కల్లు దుకాణాలు బంధు చేయాలని పేర్కొన్నారు.




