15 April, 2026 | 2:41 AM

ఆసరా పెన్షన్‌ల పంపిణీ ప్రారంభం

07-02-2026 12:01 AM

ఉట్నూర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): వృద్ధులకు, వికలాం గులకు వితంతువులకు నెల నెల పంపిణీ చేసే ఆసరా పింఛన్‌ల పంపిణీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభించారు. ఈ నెల 3న ‘విజయక్రాంతి‘ దినపత్రిక లో ‘పెన్షన్ రాక అంతా ఆగమాగం‘ అనే శీర్షికతో కథనం ప్రచూరణ మైంది. ఈ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్శి షా పింఛన్ దారులకు డబ్బులు సమకూర్చి అం దజేయాలని ఆదేశించారు.

దీంతో తపా లా శాఖ అధికారులు బ్యాంక్ అధికారులతో మాట్లాడి శుక్రవారం ఉద యం జిల్లాలోని అన్ని పోస్ట్ ఆఫీ స్‌లకు  పింఛన్ డబ్బులను సరఫరా చేశారు. పోస్ట్ ఆఫీస్ అధికా రులు, సిబ్బంది పింఛన్ దారులకు పెన్షన్ డబ్బు లు పంపిణీ చేశారు. పెన్షన్ డబ్బులు వచ్చేందుకు కృషి చేసిన ‘విజయక్రాంతి‘  దినపత్రిక తో పాటు కలెక్టర్‌కు పింఛన్ దారులు కృతజ్ఞతలు తెలిపారు.