calender_icon.png 14 December, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

13-12-2025 01:10:25 AM

  1. లోయలో ప్రైవేట్ బస్సు పడి 9 మంది దుర్మరణం
  2. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో ఘటన

అమరావతి, డిసెంబర్ 12: ఏపీలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 9 మంది మృత్యువు పాలయ్యారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ల వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మం ది ప్రయాణికులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. 

చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది అన్నవరం నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి ఆందోళనకరం గా ఉండడంతో భద్రాచలం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారిం చినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బం ది చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.  

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేం ద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.౨లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు.

పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పలువురు మరణించడంపై విచారం వ్యక్తంచేశారు. బాధితులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడారు. కాగా ప్రమాద స్థలిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పరిశీలించారు.

చింతూరు ఏరియా ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. అలాగే హోం మంత్రి అనిత కూడా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.