calender_icon.png 14 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ సమావేశానికి మళ్లీ శశిథరూర్ డుమ్మా

13-12-2025 01:31:28 AM

వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరు

న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౨: త్రివేండ్రం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూ ర్ వరుసగా కీలక పార్టీ సమావేశాలకు గైర్హాజరవుతుండటం పార్టీలో కలకలం రేపు తోంది. తాజాగా శుక్రవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన లోక్‌సభ ఎంపీల సమావేశానికీ ఆయన హాజరుకాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంతో శిశిథరూర్ గైర్హాజరైన సమావేశాల సంఖ్య మూడుకు చేరింది.

పార్లమెం ట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలు అవలంబించాల్సిన విధి విధానాలపై నిర్వహించిన కీలక సమావేశానికి శశిథరూర్ హా జరుకాకపోవడంపై రాహుల్ పెదవి విరిచినట్లు తెలిసింది. మరోవైపు తాను కోల్‌కతా లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి శిశిథరూర్ వెళ్లారని, పార్టీ అధిష్ఠానానికి తెలియ జేసే ఆయన కోల్‌కతా వెళ్లారనే ప్రచారమూ సాగుతున్నది. శశిథరూర్ గతంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి పార్టీ ఆయనపై కాస్త గుర్రుగా ఉన్న ట్లు తెలిసింది.