02-12-2025 08:32:11 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో వార్డు సమస్యలు తీర్చడానికి పట్టణ వాసి ప్రముఖ పాత్రికేయుడు, యువకుడు సిలువేరు ప్రకాష్ 14వ వార్డ్ లో తన నామినేషన్ పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో దాఖలు చేశారు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ గత పాలకుల చేతిలో అభివృద్ధికి నోచుకోని, రహదారి లేక, మురికి కాల్వలో ఉంటూ, ఎంతో నష్టపోయామని, ఇప్పుడు 14వ వార్డులో గల ఓటర్ల ఆశీర్వాదంతో, ప్రేమతో వారి అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వస్తున్నాని, తన వార్డ్ లో గల సమస్యలను చిత్తశుద్ధితో తీర్చడానికి, వార్డు అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. వార్డులోని ఓటర్లు అందరూ అధిక మెజారిటీతో తనని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెల్ల నవీన్, గడ్డమీద దేవేందర్, మ్యాకల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.