9 April, 2026 | 8:27 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

తనుగుల చెక్ డ్యామ్ పేలుడు ఘటనపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి నిందితులను కఠినంగా శిక్షించాలి

29-11-2025 12:00 AM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 

కరీంనగర్, నవంబరు 28 (విజయ క్రాంతి): తనుగుల చెక్ డ్యామ్ పేలుడు ఘటనపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి నింది తులను కఠినంగా శిక్షించాలని మాజీ మం త్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాక ర్ మాట్లాడుతూ.. ఇటీవల జమ్మికుంట మం డలం తనుగుల గ్రామ శివారులోని మానే రు నదిపై గల చెక్ డ్యామ్ ను ఇసుక మాఫియాకు చెందిన కొందరు పేల్చి వేశారని.. ఈ ఘటనకు సంబంధించి జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ బృందం ఆధ్వర్యంలో గత మంగళవారం రోజున చెక్ డాం పరిశీలనకు వెళ్లామని.. ప్ర మాదవశా త్తు జరిగిన ఘటన కాదని.. ఎవరో కావాలనే పేల్చినట్టు ఆనవాళ్లు లభించాయ ని తెలిపారు. ఈ ఘటనపై డిఇ, పోలీసులకు ఫిర్యా దు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని, బాధ్యులు తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు.

అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపో ర్టును కూడా బహిర్గతం చేయాలని కోరారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేల బృందంతో కలిసి త్వరలోనే రాష్ట్ర డిజిపి కి ఫి ర్యాదు చేస్తామని.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎ మ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మె ల్యే సుంకే రవిశంకర్, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్ లు ఐలెందర్ యాదవ్, ఎడ్ల అశోక్, జంగిలి సాగర్, దుర్షే డ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, నాయకులు కర్ర సూర్య శేఖర్, నేతి రవివర్మ, మీడిదొడ్డి నవీన్, వోడ్నాల రాజు, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, చేతి చంద్రశేఖర్, రాజు, ఆరే రవి,  తదితరులు పాల్గొన్నారు.