calender_icon.png 28 November, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ గూటికి బీఎస్పీ నేత

28-11-2025 11:15:33 PM

బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఓం ప్రకాష్

జగదేవపూర్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేకపూర్ మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామానికి చెందిన నాయకులు సిద్దిపేట జిల్లా  బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కటికల ఓం ప్రకాష్ స్థానిక ఎన్నికలవేళ కాంగ్రెస్ గూటికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే మాజీ డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జగదేవపూర్ మండల కేంద్రంలో పీర్లపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ పదవి కోసం జిల్లా పార్టీ పదవిని వదులుకొని కాంగ్రెస్ గుటికి చేరడంతో కొంతమంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవలు చేస్తున్న ఇతర పార్టీ నుండి అభ్యర్థులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడంతో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పై ప్రజలు విమర్శలకు గుప్పిస్తున్నారు. సొంత గ్రామం పీర్లపల్లిలో రవీందర్ రెడ్డి ఇతర పార్టీ నాయకున్ని పార్టీలోకి తీసుకొని నిలబెట్టడంపై ఆంతర్యం  ప్రజలు చెవులు కొనుకుంటున్నారు. కొంతమంది బిఆర్ఎస్ నాయకులు అయితే బహిరంగంగానే ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీ నాయకులు తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు.ఏది ఏమైనా గ్రామాల్లో ఎన్నికల వేడి కొనసాగుతుందని చెప్పవచ్చు.