28-11-2025 11:18:50 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలం జంగమాయిపల్లి గ్రామంలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకట్ రెడ్డి నివాసంలో శ్రీశ్రీశ్రీ. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమాన్ని పూజారి శ్రీనివాస్ రావు ఘనంగా జరిపించారు. ఉదయం 11.30 గంటల నుండి అయ్యప్ప రజిత వెంకట్ రెడ్డి దంపతులు అయ్యప్ప స్వామి పంచంలోహ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటలకు 18 మెట్ల పడిని వెలిగించి, అయ్యప్పకు హారతులు ఇచ్చారు.
అనంతరం మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేసి, స్వామి పాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా 18వ మెట్టు రాజేందర్ నాథ్ నారికేలా గురుస్వామిని, ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయ పూజారి శ్రీనివాస్ గురు స్వామిని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకట్ రెడ్డి దంపతులు శాలువాతో సత్కారించి, ఆశీర్వాదలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాథ్, ప్రతినిధులు శ్రీనివాస్, ఈశ్వరగౌడ్, మురళి, తరుణ్ స్వామి, అయ్యప్పలు పాల్గొన్నారు.