17-10-2025 12:40:20 AM
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి, రాశిఖన్నా హీరోయిన్లు. ప్రముఖ స్టైలిష్ నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియాఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సిద్దూ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో వరుణ్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్ సృష్టిస్తాడు.
బెర్ముడా ట్రయాంగిల్ పైనుంచి షిప్ వెళ్లినా, ఎయిర్‌క్రాఫ్ట్ వెళ్లినా దానిలోకి లాగేసుకుంటుంది. ‘తెలుసు కదా’ కూడా అలాంటి లవ్ ట్రయాంగిల్. ఈ సినిమా చూసిన వాళ్లందరినీ అది లాగేస్తుంది” అన్నారు. ‘ఇది చాలా స్పెషల్ ఫిలిం’ అని కథానాయకి శ్రీనిధిశెట్టి తెలుపగా, మరో హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ.. ‘తెలుసు కదా నా మనసుకు చాలా దగ్గరైన సినిమా’ అని చెప్పింది. చిత్ర దర్శకురాలు నీరజ, నిర్మాత కృతి, నటుడు వైవా హర్ష, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్, డీవోపీ జ్ఞానశేఖర్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.