calender_icon.png 18 October, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాల డాటరాఫ్ ప్రసాద్‌రావు

17-10-2025 12:38:12 AM

రాజీవ్ కనకాల, ఉదయభానుతోపాటు ఓటీటీ రైజింగ్ స్టార్ వసంతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘డాటరాఫ్ ప్రసాద్‌రావు: కనపడుట లేదు’. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌతిండియన్ స్క్రీన్స్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తెలుగు జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. “మనలో ఉండే భావోద్వేగాల నుంచి శక్తిమంతమైన కథలు వస్తాయని మా జీ5 నమ్మకం. అలాంటి కథే ‘డాటరాఫ్ ప్రసాద్‌రావు: కనపడుట లేదు’.

ఇది తండ్రి మనసులోని ప్రేమ, బలమైన ఇంటెన్సిటీని, మనసులో తెలియని భయాలను ఆవిష్కరిస్తుంది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథాంశమిది” అన్నారు. “డాటరాఫ్ ప్రసాద్‌రావు: కనపడుటలేదు’ మిస్టీరియస్, సస్పెన్స్‌ఫుల్ నెరేషన్‌తో సాగే సిరీస్ మాత్రమే కాదు.. తండ్రీకూతురు మధ్య ఉండే విడదీయరాని ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రసాదరావు పాత్రలో ఓ తండ్రిగా ఆ ఎమోషన్స్‌ను ఫీలయ్యా” అని నటుడు రాజీవ్ కనకాల చెప్పారు. ఉదయభాను మాట్లాడుతూ.. “ఈ సిరీస్‌లోని బలమైన కథ మనసులను తాకుతుంది. ఇద్దరమ్మాయిలకు తల్లిగా నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా” అని తెలిపారు.