calender_icon.png 18 October, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ హీరోకు ఏమిస్తానంటే..!

17-10-2025 12:41:43 AM

యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి ‘డ్యూడ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు ఇందులో ప్రదీప్ సరసన మరోమారు జత కడుతోంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ డైరెక్టర్. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ సరదాగా అడిగిన ప్రశ్నలకు కథానాయకి మమిత బైజు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది.

ఆమె గతంలో నటించిన ‘ప్రేమలు’, ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘డ్యూడ్’ సినిమా టైటిల్స్‌ను ఉద్దేశించి యాంకర్ అడిగినప్పుడు మమిత బదులిచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. “ప్రభాస్, అల్లు అర్జున్.. ఇద్దరికీ ‘ప్రేమలు’ ఇస్తాను. రామ్‌చరణ్, ఎన్టీ ఆర్.. వీళ్లిద్దరికేమో ‘డ్యూడ్’ ఇస్తాను. ఇక విజయ్ దేవరకొండకు ‘ప్రేమలు’.. నానికి ‘డ్యూడ్’ ఇస్తాను” అని తెలిపింది. ఇక మమిత వేదికపై మాట్లాడుతూ.. “మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్. వీరితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది.

ప్రదీప్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభవం లభించింది” అని చెప్పింది. ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. హైదరాబాదు తనకు ఇంకో కుటుంబం అని చెప్పారు. తన సినిమాలన్నీ గొప్పగా ఆదరించారని కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ సినిమాకు చాలా మంచి పేమెంట్స్ తీసుకున్నాను’ (నవ్వుతూ) అని చెప్పారు. మూవీ డైరెక్టర్ కీర్తీఈశ్వరన్ ప్రసంగిస్తూ భావోద్వేగానికి గుర య్యారు.