calender_icon.png 9 May, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాల కుబేర

09-05-2025 01:01:08 AM

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సార్బ్ వంటి ప్రముఖ తారాగాణంతో  దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ‘కుబేర’. భావోద్వేగాలే ప్రధానంగా ఆకట్టుకునే డ్రామా, గ్రాండ్ విజువల్స్‌తో రూపుదిద్దుకుంటున్న బహుభాషా ప్రాజెక్ట్ ఇది. జూన్ 20న విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరో 45 రోజుల్లో ఈ సినిమా ప్రేక్ష కుల ముందుకు రానుందన్న విషయాన్ని గుర్తుచేస్తూ మేకర్స్..

ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్‌ను ధనుష్, రష్మిక మందన్న సరదా కబుర్లు చెప్పుకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకా లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.