calender_icon.png 9 May, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజ్ లుక్ మార్చేదెందుకు?

09-05-2025 01:02:38 AM

ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంది ‘త్రీ రోజెస్’. ఓటీటీ వేదిక ఆహాలో సూపర్ హిట్ అయిన ఈ వెబ్‌సిరీస్‌కు ఇప్పుడు సీజన్2 రాబోతోంది. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా.. రవి నంబూరి, సందీప్ బొల్ల కథారచన చేయగా, కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు.

త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సీజన్2 నుంచి హీరోయిన్ రాశీసింగ్ క్యారెక్టర్‌కు సంబంధించి గ్లింప్స్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఇందులో రాశీసింగ్ పాత్రను మొదట సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా పరిచయం చేశారు.

తర్వాత ఆమె ఆధునిక లుక్‌లోకి మారిపోవడాన్నీ చూడొచ్చు. మరి ఆమె ఎందుకు సంప్రదాయ అవతార్ నుంచి ఆధునిక లుక్‌లోకి మారిందనేది ఆసక్తిని రేకెత్తించింది. ఆమెలో ఈ పరివర్తన, మార్పు వెనుక గల కారణం తెలుసుకోవాలంటే ప్రేక్షకులు తమ సిరీస్‌ను చూడాల్సిందేనని టీమ్ చెప్తోంది.