09-05-2025 12:59:48 AM
మంగపుత్ర నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘వృశ్చికం’ అనే చిత్రాన్ని తెరకెక్కించను న్నారు. ఇందులో యశ్విక హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీఆద్య నిర్మాణం పతాకంపై శివరామ్ నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజర య్యారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.
నటుడు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సుప్రీంకోర్టు అడ్వొకేట్ హబీబ్ సుల్తానా క్లాప్‌నిచ్చారు. అనంతరం హీరో, దర్శకుడు మంగపుత్ర మాట్లాడుతూ.. ‘నేను 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా ఉన్నా. ఇప్పుడు ‘వృశ్చికం’తో హీరోగా, దర్శకుడిగా మారుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నాం” అని తెలిపారు. క్రాంతి బలివాడ, కోర్టు శ్రీనివాస్, మంజు ఆర్య, రవి, కోసూరి సుబ్రహ్మణ్యం తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: గంగాధర్‌రెడ్డి; డీవోపీ: రాజ్ కే దిలీప్; సంగీతం: ప్రమోద్, ఆర్ట్: సముద్రాల రవిచంద్ర; సహనిర్మాత: తాండ్ర గోపాల్.