29 June, 2026 | 7:05 PM

ఫుట్‌వేర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం

13-06-2024 02:05 AM

రూ. 50 లక్షల ఆస్తి నష్టం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి) : పాతబస్తీ పురా నీ హవేలీలోని ఎస్కే ఫుట్‌వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల విలువ చేసే చెప్పులు, ముడి సరుకు దగ్ధమైందని షాపు యజమాని సుల్తాన్ ఖాన్ వాపోయాడు. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మీర్‌చౌక్ అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లలో మంటలు ఆర్పివేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.