నిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
13-06-2024 02:04 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి) : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు నిమ్స్ ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ తెలిపారు. పలు విభాగాల్లో మొత్తం 11 పోస్టులు ఖాళీలున్నట్లు పేర్కొన్నారు. 1 సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు, 1 ప్రాజెక్టు నర్సు థర్డ్ గ్రేడ్ పోస్టు, 2 ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ పోస్టులు, 3 క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్లు, 1 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు, 1 సీనియర్ క్లీనికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టు, 2 ఎస్‌ఆర్‌సి ప్రాజెక్టు లైజన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం నిమ్స్ వెబ్‌సైట్ www. nims.edu.in ను సందర్శించాలని కోరారు.






