22 August, 2026 | 4:01 AM

పతకం ఖాయం

22-08-2026 12:20 AM

చరిత్ర సృష్టించిన గాయత్రి, ట్రీసా జోడీ 

సెమీస్ చేరిన భారత జంట

పురుషుల డబుల్స్‌లో సాత్విక్ జోడీ ఓటమి

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ 

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ చరిత్ర సృష్టించింది. వరల్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం చేసింది ఈ. భారత స్టార్ ద్వయం సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో ఈ జోడి చైనాకు చెందిన జియాయి ఫాన్, జాంగ్ షు జియ్పా 16-21, 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది.

దీంతో ట్రీసా- గాయత్రి జోడీకి పతకం కనీసం కాంస్యం ఖాయమైంది. ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో  భారత ద్వయంపై చైనా జోడీ ఆధిపత్యం సాగింది. అయితే రెండో గేమ్‌లో భారత జోడీ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చి స్కోరు సమం చేసింది. ఫలితం కోసం మూడో సెట్ ఆడాల్సి వచ్చింది. అయితే ఇండియన్ షట్ల ర్లు అదే జోరును ప్రదర్శించారు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి మూడ సెట్‌ను 21-13 భారీ తేడాతో గెలుచుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్ మహిళల డబు ల్స్‌లో భారత్ చివరిసారిగా 2011లో పతకం సాధించింది.

లండన్ వేదికగా జరిగిన ఆ పోటీలో భారత షట్లర్ జోడీ జ్వాలా గుత్తా - అశ్విని పొన్నప్ప కాంస్య పతకం గెలుచుకుంది. మళ్లీ 15ఏళ్లకు ఈ విభాగంలో భారత్ పతకం అందుకోనుంది. 2022, 2023 సంవత్సరాలలో ట్రీసా - గాయత్రి జోడీ వరుసగా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్స్కు చేరుకుంది. 2022లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. గతేడాది ప్రారంభంలో టాప్ 10లోకి ప్రవేశిం చింది. అయితే  ఈ సంవత్సరం ప్రారంభంలో  ట్రీసా చీలమండకు గాయమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఇటీవల యూఎస్ ఓపెన్, ఫిలిప్పున్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచింది. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్‌షిప్స్‌లోనూ పతకం ఖా యం చేసుకుంది.