calender_icon.png 19 December, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుండిపోయేలా మిస్‌టీరియస్ క్లైమాక్స్

17-12-2025 01:15:08 AM

రోహిత్ హీరోగా నటించిన సినిమా “మిస్’టీరియస్’. అబిద్ భూషణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ముఖ్య పాత్రలు పోషించారు. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్‌పై జయ్ వల్లందాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మహి మాట్లాడుతూ.. “మా ‘మిస్‌టీరియస్’ సినిమాను రెగ్యులర్ ఫార్మెంట్ కాకుండా విభిన్న మైన పాయింట్‌తో తెరకెక్కించాం. ఇందులో క్రైమ్‌తోపాటు లవ్, క్రష్ ఉంటాయి.

థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పటివరకు ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలను ఏ సినిమాలోనూ చూపించలేదు. చివరి వరకు సినిమాలో కిల్లర్ ఎవరు అనేలా సస్పెన్స్‌గానే సాగుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ అందరూ మాట్లాడుకునేలా, గుర్తుండిపోయేలా ఉండబోతుంది. మధ్యలో పాటలు వచ్చే పాటలు.. ప్రేక్షకుడు డిస్ట్రర్బ్ కాకుండా మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయి” అని చెప్పారు.