calender_icon.png 10 November, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుర్కపల్లిలో మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయలి

10-11-2025 06:16:59 PM

టీవీజెఎస్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బచ్చలి ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. సారంగపల్లి పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం, ప్రాథమిక సేవల కోసం మినీ అంగన్వాడీ కేంద్రం అత్యవసరమన్నారు.

గ్రామస్థులు అంగన్వాడీ సేవల కోసం కిలో మీటర్ దూరంలో నున్న సారంగపల్లి గ్రామానికి వెళ్లవలసి వస్తోందని తద్వార గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామస్థులకు సమయానుకూలంగా అంగన్వాడీ సేవలు అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన స్థలం, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, గ్రామస్థులకు పౌష్టికాహారంతో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులో ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మినీ అంగన్వాడీ కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.