calender_icon.png 10 November, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటీనటుల సంక్షేమానికి కృషి

10-11-2025 06:13:54 PM

నిర్మల్ రూరల్: తెలంగాణ సినీ అసోసియేషన్ అండ్ టీవీ ఆర్టిస్ట్ ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు పాయం శంకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాలులో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా లఘు చిత్రం హీరో హాస్యనటుడు ఆర్ఎస్ నంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ షూటింగ్ సమయంలో కళాకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కళాకారులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నరేష్ వర్మ, కళాకారులు పాల్గొన్నారు.