10-11-2025 06:20:00 PM
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపు కొరకు సింగరేణి ఎన్సీడబ్యుఏ ఉద్యోగులకు పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సింగరేణి ఏరియా సీనియర్ పర్సనల్ అధికారి ఎం కార్తీక్ తెలిపారు. సోమవారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్లో క్వార్టర్ల కొరకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియాలో ఖాళీగా ఉన్న క్వార్టర్ల కేటాయింపు కొరకు మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలకు 107 క్వార్టర్ లను ప్రకటించగా, వీటికి 87 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించి, సీనియార్టీ ప్రకారం 18 మంది ఉద్యోగులకు క్వార్టర్లను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సీనియర్ పర్సనల్ అధికారి వంశీ, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) రాజు, ఏరియా పర్సనల్ విభాగం సిబ్బంది, ఎస్ అండ్ పిసి సిబ్బంది పాల్గొన్నారు.