calender_icon.png 10 November, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లంతైన డ్రైవర్ మృతదేహం లభ్యం

10-11-2025 07:12:15 PM

రిజర్వాయి గేటు వద్ద లభ్యమైన లారీ డ్రైవర్ ఈట శ్రీకాంత్ మృతదేహం..

గరిడేపల్లి (విజయక్రాంతి): మండలంలోని మర్రికుంట సమీపంలో ఉన్న సాగర్ ఎడమ ప్రధాన కాలవలో ఆదివారం గల్లంతైన లారీ డ్రైవర్ ఈట శ్రీకాంత్ మృతదేహం సోమవారం లభ్యమయింది. మండలంలోని పొనుగోడు రిజర్వాయర్ గేట్ల వద్ద మృతదేహం లభ్యమైనట్టు గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్ కు చెందిన ఈట శ్రీకాంత్ ఆదివారం ప్రమాదవశాత్తు సాగర్ ఎడమకాలలో గల్లంతైన విషయం తెలిసింది. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం తో గాలింపు చర్యలు చేపట్టగా రిజర్వాయర్ గేట్ల సమీపంలో మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.