10-11-2025 07:07:51 PM
కాటారం (విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్ట్ గాదె రమేష్(విజయక్రాంతి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటేశ్వర్లు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కొలుగూరి సంజీవరావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్న రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.