10-11-2025 06:59:08 PM
మణుగూరు (విజయక్రాంతి): భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప, దుర్గామాత, శివమాలలు ధరించిన స్వాములకు సోమవారం కోల్ ట్రాన్స్ పోర్ట్ ఆధ్వర్యంలో(భిక్ష) అన్నదానం నిర్వహించారు. సింగారంలోని శ్రీ కోదండ రామాలయంలో గల రామాలయం పీఠం గురుస్వాములు పాటి వెంకటేశ్వర్లు, కొంగరా ఏడుకొండలు, కోల్ ట్రాన్స్ పోర్ట్ నిర్వాహకులు కొండా మురళి, కృష్ణ, మాధురి లత దంపతులు, వికెఎమ్ ప్రసాద్ స్రవంతి (అన్నంనేని ప్రసాద్) దంపతులు, అన్నంనేని రాజేశ్వరరావు సరోజిని దంపతులు, పిండిగ రఘువరన్, ప్రేమ్ లత దంపతులు మాలధరించిన 200 మంది స్వాములకు (భిక్ష) అన్న ప్రసాదం వడ్డించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి యేటా కోల్ ట్రాన్స్ పోర్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో మాలలు ధరించిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నియమ నిష్టలతో చేసే అయ్యప్ప దీక్ష.. మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుందని మండల కాలం 41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తుడు.. దీక్ష తర్వాత కూడా దుర్గుణాలను వదిలి.. సన్మార్గంలో నడిచేలా చేస్తుందని గురుస్వాములు తెలిపారు. కార్యక్రమంలో రామాలయం పీఠం, యాకయ్య గురుస్వామి శివాలయం పీఠం, తనుగుల శ్రీను గురుస్వామి పీఠం,లాలూ గురుస్వామి పీఠం, కళ్యాణ్ బాబు గురు స్వామి కనకదుర్గా మలేశ్వర భవాని పీఠం స్వాములు భిక్షలో పాల్గొన్నారు.