16 April, 2026 | 11:42 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఏస్ ఫుల్ మీల్స్‌లాంటి చిత్రం

23-05-2025 12:00 AM

విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏస్’. దర్శక, నిర్మాత అరుముగకుమార్ 7సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్ నటించారు. మే 23న రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బీ శివప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “అరుముగ కుమార్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. సినిమాలో నాకు మొదటి ఛాన్స్ ఇచ్చింది కూడా ఆయనే. మళ్లీ ఇప్పుడు ఆయనతో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది” అన్నారు. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ మాట్లాడుతూ.. “ఏస్’ సినిమాలో యాక్షన్, రొమాన్స్, ఫన్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలతో ఫుల్ మీల్స్‌లా ఉంటుంది” అని చెప్పారు.

దర్శక, నిర్మాత బీ శివప్రసాద్ మాట్లాడుతూ.. “ఏస్’ ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ హిట్ అయినట్టు కనిపిస్తోంది. విజయ్ సేతుపతి గారు మళ్లీ అందరినీ ఆకట్టుకోబోతున్నారు. అన్నీ సెట్ అయితే ‘రొమాంటిక్ డాన్’ అనే సినిమాను ఆయనతో త్వరలోనే ప్రకటిస్తా” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి దివ్యా పిళ్లు, నటుడు బబ్లూ పృథ్వీ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.