23-05-2025 12:00:00 AM
పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్. ఆయన నటించిన కొత్త చిత్రం ‘నిశ్శబ్ద ప్రేమ’. ప్రియాంక తిమ్మేశ్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కార్తికేయన్ ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 23న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. “నిశ్శబ్ద ప్రేమ’ లవ్‌స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపిన గ్రిప్పింగ్ మూవీ ఇది.
మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషా సినిమా అయినా కంటెంట్ ఉంటే మరోచోట తప్పకుండా ఆదరణ పొందుతుంది. ఈ సినిమా సక్సెస్ మీద అలాంటి నమ్మకమే మా అందరికీ ఉంది” అన్నారు. హీరోయిన్ ప్రియాంక తిమ్మేశ్, డైరెక్టర్ రాజ్ దేవ్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.