17-12-2025 01:36:03 AM
జవహర్ నగర్, డిసెంబర్ 16(విజయక్రాంతి) : జవహర్ నగర్ ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని, ప్రభుత్వ స్థలాలను కబ్జాల బారి నుంచి కాపాడాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ కోరారు. మంగళవారం మేడ్చల్ కలెక్టరేట్లో కలెక్టర్ మనూ చౌదరిని కలిసి వినతిపత్రం అందజేశారు. జీవో 58, 59 పట్టాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని, దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
అలాగే కోర్టు వివాదాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను రక్షించి మార్కెట్లు, జిమ్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ పాల్గొన్నారు .