నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ
17-12-2025 01:36 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డులో అధికార, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టింది. ఈ మేరకు మంగళవారం ఇంటర్ బో ర్డుకు అధికారుల బృందం వచ్చి తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇంటర్ బోర్డులో రూ.కో ట్లలో నిధులు దుర్వినియోగమయ్యాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టినట్లు ఆ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇంటర్ బోర్డులో ఏ ర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, రెనోవేషన్‌ఖర్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు వివరాలను అధికారులు అడిగితెలుసుకున్నట్లు తెలిసింది.






