calender_icon.png 17 December, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహన న్యాయ కళాశాలలో స్పోర్ట్స్ లాంజ్ ప్రారంభం

17-12-2025 07:17:57 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో స్పోర్ట్స్ లాంజ్ ని ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, న్యాయ విద్యార్థులు తమ ఆటవిడుపు కోసం క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ వంటి అంతర ఆటలను ఆడి తమ ఆత్మ ధైర్యాన్ని, శారీరకద్రుడత్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

వచ్చే సంవత్సరం వరకు న్యాయ కళాశాలకు కొత్త భవనాన్ని నిర్మిస్తామని పురుషులకు, మహిళలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయ విద్యార్థులతో టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఆడారు. ఈ కార్యక్రమంలో న్యాయ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సూరేపల్లి సుజాత, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ నజీముద్దీన్ మున్వర్, డాక్టర్ కన్నా, ఫిజికల్ డైరెక్టర్ డి విజయ్ కుమార్, కుతాడి శీను, న్యాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.