17-12-2025 07:00:05 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో కరెంట్ షాక్‌తో గేదె మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. తల్వేద గ్రామానికి చెందిన బక్కొల్ల సాయేందర్ రోజువారి లాగే తన గేదెలను మేత కోసం పొలాల్లోకి తీసుకెళ్లాడు. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ కు గేదె తగలడంతో కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు హైట్ పెరగడంతో ట్రాన్స్ఫార్మర్ గద్దె దిగువ ఉండడంతో గేదె మృతిచెందింది.
గమనించిన రైతు వెంటనే విద్యుత్ అధికారులకు తెలుపడంతో సంఘటన స్థలాన్ని సందర్శించారు. చనిపోయిన గేదె విలువ సుమారు 90,000 ఉంటుందని రైతు వాపోయారు. వెటర్నరీ డాక్టరు సంఘటన స్థలంలో పంచనామ నిర్వహించారు. విద్యుత్ అధికారులు నష్టపరిహారం చెల్లించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని రైతు వాపోయాడు.