calender_icon.png 17 December, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్‌లను సన్మానించిన చిరుమర్తి

17-12-2025 06:54:37 PM

నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బుధవారం నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఆయనను కలిసిన వారిలో నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి సర్పంచ్ చిన్నేటి సత్తయ్య, పల్లెపహాడ్ ఉప్ప సర్పంచ్ గంగుల దిలీప్ రెడ్డి, లింగోటం సర్పంచ్ పనస సరోజ వెంకటయ్య తదితరులు ఉన్నారు.