calender_icon.png 17 December, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడెల్లి ఆలయంలో మండల పూజ

17-12-2025 06:57:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): కోరిన భక్తుల కొంగుబంగారం అడెల్లి పోచమ్మ అమ్మవారు అని మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో బుధవారం నిర్వహించిన మండల పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లోల ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ పునః ప్రతిష్ట జరిగి బుధవారం నాటికి 41 రోజులు కావడంతో మండల పూజలను వేద పండితులు గురు మంచి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. అలాగే ఆలయం పరిసరాల్లో జంతుబలి నిషేధం సైతం విధించారు. 

అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ ఆలయాన్ని ఏడు కోట్లతో నిర్మించడం జరిగిందని మిగతా అభివృద్ధి పనులను సైతం పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. అమ్మవారి ప్రాశస్తం పెరగాలంటే ఇక ముందు నుండి గర్భగుడిలోకి ఎవరిని అనుమతించకూడదని సూచించారు శృంగేరి పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు చేపట్టాలని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, అల్లోల సురేందర్ రెడ్డి , పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డిమాజీ జెడ్పీటీసీ, మహిపాల్ రెడ్డి మాజీ ఎంపిపి, ధర్మాజీ రాజేందర్ fscs చైర్మన్, నారాయణ రెడ్డి PACS చైర్మన్, రాజు ఆడెల్లి మాజీ సర్పంచ్ తో పాటు ఆలయ అధ్యక్షులు భోజ గౌడ్ ధర్మకర్తలు పురోహితులు శ్రీనివాస్ శర్మ, లక్కాకుల నరహరి మాజీ కౌన్సిలర్, శ్రీకాంత్ యాదవ్ మాజీ వైస్ చైర్మన్, కొప్పుల శ్రీధర్ మాజీ వైస్ చైర్మన్, పతని భుమేష్ మాజీ వైస్ ఎంపిపి, మల్లేష్ మాజీ సర్పంచ్, ఉట్ల రాజేశ్వర్, దశరథ్ రాజేశ్వర్, పాకాల రామచందర్ పాకాల ఫౌండేషన్ చైర్మన్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.