17-12-2025 06:52:42 PM
నిర్మల్ (విజయక్రాంతి): బుధవారం రోజున నిర్మల్ పోస్ట్ ఆఫీస్ పరిసరాలలో IPPB ప్రమాద భీమా నగదు రూ. 15 లక్షల చెక్కును శ్రీమతి శభానా బేగం R/O సోన్ కి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా సూపరింటెండెంట్ గంప స్వామీ అందజేశారు. శ్రీమతి శభానా బేగం భర్త(Late) మొహమ్మద్ వాహిద్ ఉద్దీన్ గతంలో తపాలాశాఖ IPPB నిర్మల్ బ్రాంచ్ లో రూ.755/- తో ప్రమాద భీమా పాలసీ తీసుకున్నారు. ప్రమాదవశాత్తు ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆ ప్రమాద భీమా పాలసీకి సంబందించిన రూ. 15 లక్షల చెక్కును నామిని అయిన శ్రీమతి శభానా బేగంకి అందజేశారు.