calender_icon.png 20 August, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిదర్శనమే ఫొటో

20-08-2025 12:39:52 AM

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి ) : మన జీవితంలోని ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిదర్శనంగా నిలిచేదే ఫోటో అని, ఈ ఫోటో కదలని చిత్రమైనప్పటికీ మనిషి మనసును  కదిలిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంక ర్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కరించుకొని ఆదిలాబాద్లో జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ సృష్టికర్త లూయిస్ డాగ్యురే చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు బహుమతులు అందజేశారు. దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడు తూ... ఫోటోగ్రాఫర్లు తీసే చిత్రాలు పది కాలాలపాటు పదిలంగా నిలిచిపోతాయని, ఎప్ప టికీ గుర్తుండిపోయేలా, అందంగా కనిపించే లా వీడియోలు తీయడం ఫోటోగ్రాఫర్లకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఫొటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్, విజయ్ కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దొడ అశోక్, హరికృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా గౌరవ సలహదారులు అనిల్ దేశ్పాండే, గౌరవ అధ్యక్షుడు మురళిధర్, కోశాధికారి సంతోష్, విశా ల్ తదితరులు పాల్గొన్నారు.