calender_icon.png 20 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా!

20-08-2025 12:39:53 AM

  1. పక్కదారి పడుతున్న సబ్సిడీ గ్యాస్ 
  2. బండ బరువులోనూ అక్రమాలే
  3. ఏజెన్సీ నిర్వాహకుల మాయా జాలం
  4. అక్రమాల మాటున కాసుల పంట..
  5. తనిఖీలు మరచిన అధికారులు

మణుగూరు, ఆగస్టు 19 ( విజ య క్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గృ హజ్యోతి పథకంలో భాగంగా ప్రతి గ్యాస్ సి లిండర్‌రూ. 500 అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు కారుస్తూ మం డలంలో కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు అక్రమాల పర్వానికి తెరలేపారు. దీం తో ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే వంట ఇంధనం అక్రమార్కులకు కాసులు వర్షం. కురిపిస్తుంది. కొందరు వ్యాపారులు సబ్సిడీ గ్యాస్ ను నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపుతూ పెద్ద ఎత్తున దందాను సాగిస్తున్నారు.

పక్కదారి పడుతున్న సబ్సిడీ గ్యాస్

సబ్సిడీ గ్యాస్ను కొంత మంది నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపు తూ, వాహనాలకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ పె ద్దదందా సాగిస్తున్నారు.పట్టణంలో అక్రమ ఫిలింగ్ వ్యాపారం జోరుగా సాగుతుంది. సబ్సిడీ గ్యాస్ బండలోని ఇంధనాన్ని మినీ సి లిండర్లో నింపి కేజీ రూ120 నుండి రూ 150 లకు వినియోగదారుల అవసరాలను ఆ సరా చేసుకొని విక్రయిస్తూ జేబులు నింపుకుంటు న్నారు. రీఫిలింగ్ ద్వారా ఒక్కో స న్సిటీ గ్యాస్ బండపై రూ. 1000 నుండి రూ 1500 వరకు సంపాదిస్తున్నారు.

మినీ సి లిండర్  సైజును బట్టి డబ్బులు గుంజుతున్న వ్యాపారులు అగడాలకు నివారించే  అధికారులు కరువయ్యారు. అంతా బహిరంగమే... మండలంలోని గ్యాస్ సిలిండర్ల విక్రయాలను పరిశీలిస్తే సివిల్ సప్లై అధికారులు ఉ న్నారా అనే సందేహం కలుగుతుంది. ప్రధా న రహదారిపై గ్యాస్ సరఫరా చేసే ఓ ఏజెన్సీ నిర్వాహకులు నిత్యం టాటా ఏస్, అప్పి ఆటోలలో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్లకు  గృహ అవసరాలకు వినియోగిం చే సిలిండర్లను సరఫరాచేస్తున్నారు.

ఒక్కో వాణిజ్య సముదాయంకు రోజుకు కనీసం నాలుగు సిలిండర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు సివిల్ సప్లై అధికారుల కు మధ్య మంచి సన్నిహిత్యం ఉన్నట్లుగాఅద్ధంపడుతోంది.గృహ అవసరాల గ్యాస్ సిలిండ ర్ లను వాణిజ్య అవసరాలకు అధికంగా విక్రయిస్తున్నారు. చట్ట వ్యతిరేకం అని తెలిసినా ఏమవుతుందిలే అనే ధీమాతో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

దీంతో పట్టణం లోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు, బిర్యాని హోటళ్లలో ఎక్క డ చూసినా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లే కనిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కు తూ నిర్భయంగా ఈ సిలిండర్లను వాడుతున్నా, పట్టించుకునే అధికారులే కరువ య్యారు.ఇంత జరుగుతున్న  పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించు కోకపోవడం ప లు అనుమానాలకు తావిస్తోంది. కళ్లముందే ఈ అక్రమ గ్యాస్ దందా జోరుగా సాగుతు న్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తూ మామూళ్ల మత్తులో ము నిగిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.