20-08-2025 12:38:33 AM
మంచిర్యాల, ఆగస్టు 19 (విజయక్రాంతి) : జిల్లాలోని జన్నారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ రజియా భాను ఉత్తమ ఉర్దూ ఉపా ధ్యాయురాలిగా అవార్డును అందుకున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 2022 రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియంలో విశేష సేవలందించిన 173 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయగా జిల్లాలో నాణ్య మైన ఉర్దూ బోధనతో పాటు విద్యార్థుల భాష నైపుణ్యాలు, సాంస్కృతిక విలువలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించి, పిల్లల సంరక్షణకు చైల్ కేర్ కార్యక్రమాలు నిర్వహించి, తాత్కాలిక భవనాల స్థానంలో శాశ్వత భవనాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేసిన రజియా బాను సైతం ఎంపికయ్యారు.
హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మం త్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్‌ల చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు రూ. 25 వేల బహుమతి అందుకున్నారు. రజియా భానును డీఈఓ యాదయ్యతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.