108తో పరాచకం
బ్రీతింగ్ అనలైజ్ టెస్ట్ చేయగా 211 చూపిన మీటర్
సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించిన 108 సిబ్బంది
చేవెళ్ళ ఆగష్టు 21(విజయక్రాంతి): చేవెళ్ల మండల పరిధిలోని ధర్మసాగర్ గ్రామానికి చెందిన చాకలి మల్లేష్ 108 తో పరాచక లాడారు. పోలీసులు 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 108 కు ఫోన్ చేసి తమకు కడుపునొప్పి వస్తుందని చెప్పడంతో 108 సిబ్బంది ఫిర్యాదుదారుని లొకే షన్ కు వెళ్లారు. ఆ వ్యక్తి ఆరుబయట తప్పతాయి పడి ఉండడం చూసి ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు.
మల్లేష్ కి పోలీసులు బ్రీతింగ్ ఎనలైజ్ టెస్ట్ చేయగా 211 రావడంతో హావక్కయ్యారు. మల్లేష్ నెలలో కనీ సం నాలుగు సార్లు 108కు ఫోన్ చేయడం సిబ్బంది లొకేషన్ కు వెళ్లగా అతని కుటుంబ సభ్యులు గడియ వేసుకుని ఇంట్లో ఉండడం తప్ప తాగిన మల్లేష్ ను 108 సిబ్బంది ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించడం షరా మా మూలైంది.
దీంతో 108 సిబ్బంది సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. నిజంగా ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయం అందిం చలేకపోతున్నామని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 సిబ్బంది ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు స్టేషన్లో అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.






