calender_icon.png 2 August, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని ప్రముఖ హోటల్

01-08-2025 11:41:13 PM

రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం నోటీసులు, 30 వేల రూపాయల భారీ జరిమానా!!

జిల్లాలోని రెస్టారెంట్లలో రాష్ట్ర ఫుడ్  సేఫ్టీ  టాస్క్ ఫోర్స్  అధికారుల ఆకస్మిక  దాడులు..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ తర్వాత ఉన్నతాధికారులు డైరెక్టర్ ఐపిఎం డాక్టర్ సి. శివలీల ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి, శ్రీషిక, పి.స్వాతి, అంకిత్ రెడ్డిలతో కూడిన బృందం వేములవాడ గల తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్(Taj Family Restaurant)ను ఆకస్మికంగా తనిఖీ చేయగా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేయడం, కిటికీలకు మెష్ లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ పాటించకపోవడం, అపరిశుభ్రంగా ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్లలో నిలువ చేసిన దుర్వాసనతో కూడిన మాంసపు ఉత్పత్తులను భారీ మొత్తంలో గుర్తించడం, అలాగే  ఎగ్జాస్టర్ ఫాన్స్ పై నూనెతో కూడినటువంటి నూనె దుమ్ము ధూళితో పేరుకుపోవడం, ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ క్యాప్, హ్యాండ్ గ్లోవ్స్ ధరించకపోవడం, అపరిశుభ్ర ప్రాంతంలో మూతలు తీసిన దుమ్ము ధూళి ఈగలతో కూడిన వండిన ఆహార పదార్థాలను, కుళ్లిపోయిన ఉడికిన గుడ్లు హానికర రసాయనాలతో కూడినటువంటి కృత్రిమ రంగులను బిరియాని ఇతర ఆహార తయారీకి ఉపయోగించడం, గుర్తించడం జరిగింది.

రెస్టారెంట్ నందు 20 వేల 500 రూపాయల విలువ గల సుమారు 70 కిలోల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన టీ పౌడర్ ఇతర ముడి సరుకులు, లేబుల్ డిఫెన్స్ కలిగినటువంటి కాజు, మసాలా పొడులు, మిగిలి ఉంచిన బిర్యాని,  ఇతర ఆహార పదార్థాలను ప్రజల ఆరోగ్య నిమిత్తం హోటల్ యాజమాన్యాన్ని ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ హెడ్ వి.జ్యోతిర్మయి హెచ్చరించి అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది, ఎఫ్ఎస్ఎస్ 2006 చట్టం ఉల్లంఘించి నందుకుగాను. నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా మునిసిపల్ అధికారుల సమన్వయంతో హోటల్ నందు పూర్తిగా అపరిశుభ్ర వాతావరణ ఉన్నందున. ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 మున్సిపల్ చట్టం 2019 ని ఉల్లంఘించినందుకు గాను  వేములవాడ మున్సిపల్ అధికారులచే 30 వేల రూపాయల జరిమానా విధించి రెస్టారెంట్ ను తదుపరి రెక్టిఫికేషన్  చర్యల నిమిత్తం తాత్కాలికంగా  మూసి వేయించడం జరిగింది.

అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గల రుచి హోటల్ ను ఆకస్మికంగా  తనిఖీ చేయగా అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం, ఫుడ్ హ్యాండ్లర్స్,గ్లౌజ్ హెయిర్ క్యాప్స్ ధరించకపోవడం, పండిన ఆహారంపై మూతలు కప్పకపోవడం, ఈగలతో కూడిన ఆహారం ఉండడం, మూతలతో కూడిన డస్ట్ బిన్స్ వాడకపోవడం, పెస్ట్ కంట్రోల్ లేకపోవడం, స్టోర్ రూమ్ లో వంటకు ఉపయోగించేటువంటి నాణ్యతలేని ముడి సరుకులు ఉండడం, కుళ్ళిపోయిన ఫంగల్ ఇన్ఫెస్తేడ్ కాలిఫ్లవర్ క్యారెట్  ఇతర కూరగాయలు ఆహార తయారీకి ఉపయోగించడం. కాలం చెల్లిన ముడి సరుకులు, హోటల్ యాజమాన్యం కలిగి ఉండాల్సినటువంటి తగిన రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం తో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం 2006 ఉల్లంఘించినందుకు  నోటీసులు జారీ చేయడం జరిగింది  అనుమానిత ఆహార పదార్థాల శాంపులను సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్ లో గల ల్యాబ్ కు పంపించడం జరిగింది.

అదేవిధంగా వెయ్యి రూపాయల విలువగల ఐదు కిలోల పురుగులతో కూడిన మైదాపిండి, కుళ్లిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ముడి సరుకులను ప్రజల ఆరోగ్యం నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది. నిబంధనలు పాటించని, ప్రభుత్వ అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం  హెడ్ వి.జ్యోతిర్మయి తేల్చిచెప్పారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ అయిన వి. జ్యోతిర్మయి. టాస్క్ ఫోర్స్  అధికారులు సూచించడం జరిగింది,అలాగే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.