01-08-2025 11:43:32 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) సతీమణి వనజ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ బద్దిపోచమ్మ ఆలయం శ్రీ మహాలక్ష్మి ఆలయాలను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒడి బియ్యం, చీర సారెలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదం అందజేశారు.