27 July, 2026 | 12:55 AM

30 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక

27-07-2026 12:20 AM

శంకర్పల్లి, జూలై 26 (విజయక్రాంతి): శంకర్పల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 1995 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. వంద మంది పూర్వ విద్యార్థులు వేదికపైకి చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూలవర్షంతో ఆహ్వానించి శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. చదువుకున్న బడి రుణం తీర్చుకుంటూ విద్యార్థులు పాఠశాల ఆవరణలో నిర్మించిన శాశ్వత వేదిక (స్టేజి)ని పాఠశాలకు అందజేశారు. అంతకుముందు దివంగత ఉపాధ్యాయులు, మిత్రుల ఆత్మశాంతికి మౌనం పాటించారు.