3 April, 2026 | 1:52 AM

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

03-04-2026 12:10 AM

రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంరెడ్డి

సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 2 : రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో రెడ్డి జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హామీలు నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న సిద్దిపేటలో ‘చలో కలెక్టరేట్‘ కార్యక్రమం నిర్వహించి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. సమావేశంలో రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, గౌరవాధ్యక్షుడు మారెడ్డి రామలింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి పన్యాల విష్ణువర్ధన్ రెడ్డి, ముక్కిస రెడ్డి, దూది దుర్గారెడ్డి, కవ్వ లింగారెడ్డి, గూడ పద్మారెడ్డి, వంగ శైలజారెడ్డి, వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి, భూపతి రెడ్డి, నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.