3 April, 2026 | 1:57 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

03-04-2026 12:11 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, ఏప్రిల్ 2: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమానికి, ,కేతేపల్లి మండల కేంద్రం, చెర్కుపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమాలకు ఆయన హాజరై పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని, 1000 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి ప్రతి అర్హులైన పేద కుటుంబానికి అందజేస్తామని వెల్లడించారు.కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తున్నామని, రూ.15 కోట్ల నిధు లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నామని తెలిపారు. కేతేపల్లి మండల కేంద్రంలో అండర్పాస్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, , మున్సిపాలిటీ చైర్మన్ పర్సన్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.