calender_icon.png 15 November, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్ కేసు.. విచారణకు హాజరైన విష్ణుప్రియ, హీరో రానా

15-11-2025 05:38:46 PM

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ కేసులో బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ విష్ణుప్రియ, ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి శనివారం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని సీఐడీ కార్యాలయంలో సిట్ అధికారులు వారి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. ఆయా యాప్ ల ప్రమోషన్ సంబంధించిన వివరాలపై వేర్వేరుగా వారని ప్రశ్నించారు. విచారణలో భాగంగా వారి బ్యాంకు ఖతా వివరాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లను సిట్ అధికారుల ముందు సమర్పించినట్లు సమాచారం. ఈ యాప్ ల ప్రమోషన్ల కోసం చేసుకున్న ఒప్పందాలు, వచ్చిన ఆదాయంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. విచారణ పూర్తయిన అనంతరం రానా మాట్లాడుతూ.. చట్టబమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రమోషన్ చేశానని, అందుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు వివరించినట్లుగా చెప్పారు.  బెట్టింగ్ యాప్స్ వ్యవస్థాపకులపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీని నటులు ప్రకాశ్ రాజ్, విజయ దేవరకొండ, తదితరులను సిట్ విచారించింది.